TG: HCU భూముల వ్యవహారంలో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా సంఘాలతో సమావేశం అయ్యారు. వారికి ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని రకాల ఆధారాలను అందజేసి, కూలంకషంగా వివరిస్తున్నారు. 400 ఎకరాలపై వర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సీఎం మంత్రులతో భేటీ ముగిసిన కొద్ది సేపటికే.. డిప్యూటీ సీఎం ప్రజా సంఘాలతో సమావేశమయ్యారు.