భార్యపై ప్రేమతో గుడి కట్టాడు!

6496చూసినవారు
భార్యపై ప్రేమతో గుడి కట్టాడు!
దేవుడికి గుడి కట్టడం చూశాం. కొందరు నటులకు అభిమానంతో గుడి కట్టడం చూశాం. కానీ తమిళనాడు కోయంబత్తూర్ సమీపంలో పళనిస్వామి (75) తన భార్య సరస్వతిపై ప్రేమతో ఏకంగా గుడి కట్టేశాడు. 2019లో ఆమె మరణించగా మానసికంగా కుంగిపోయిన ఆయన, మొదటి వర్థంతి సందర్భంగా గుడి కట్టి భార్య విగ్రహాన్ని ప్రతిష్టించాడు. మూడేళ్లుగా నిత్యం దీపారాధన చేస్తూ భార్య జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్