రన్నింగ్ బస్ నుంచి దూకేశాడు (వీడియో)

81చూసినవారు
ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మే 16న షాకింగ్ ఘటన జరిగింది. బస్సులోని డోర్ పక్కనే ఉన్న సీట్‌లో ఓ మహిళ కూర్చుంది. అక్కడే నిల్చున్న ఓ యువకుడు మహిళ ఫోన్‌ను లాక్కున్నాడు. రెప్పపాటులో రన్నింగ్ బస్ నుంచి బయటకు దూకేశాడు. బాధితురాలు తేరుకునేలోపే ఆ దొంగ పరారయ్యాడు. దీంతో దొంగ కోసం బాధిత మహిళ కూడా వెంటనే బస్ దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్