పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆర్ఓ సంతంకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఫామ్ 13-ఏపై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. అలాగే సీరియల్ నంబర్ లేని పోస్టల్ బ్యాలెట్లను కూడా తిరస్కరించవద్దని ఈసీ తెలిపింది.