ఛత్తీస్‌గఢ్‌లో ఓ యువకుడు చేసిన పనితో విమానయాన సిబ్బంది షాక్‌కు గురయ్యారు. మద్యం మత్తులో యువకుడు రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. గోడ దూకి విమానాశ్రయంలోకి ప్రవేశించిన సదరు యువకుడు ఏకంగా రన్‌వేపైకి పరుగులు పెట్టాడు. అయితే పోలీసులు గమనించి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించగా విమానాన్ని దగ్గర నుంచి చూడాలని ఇలా చేసినట్లు చెప్పగా సిబ్బంది అవాక్కయ్యారు.