మలేషియాలో అతిపెద్ద బిలియనీర్, భారత సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్ ఏకైక కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యో రూ.40 వేల కోట్ల ఆస్తిని వదిలి బౌద్ధ సన్యాసిగా మారాడు. అజాన్ 20 ఏళ్ల కిందట 18 ఏళ్ల వయసులో థాయ్ రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు థాయిలాండ్ వెళ్లి.. అక్కడి బౌద్ధ భిక్షువులను చూసి ప్రేరణ పొందాడు. సరదా కోసం సన్యాసిని కావాలనుకున్న అజాన్ ఇదంతా తన ఆధ్యాత్మిక మార్గానికి అడ్డంకిగా భావించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.