ముంబైకు చెందిన రమేక్ బల్ అనే వ్యక్తి ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఏకంగా రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు. రమేక్ బల్ మానసిక సమస్యలతో బాధపడేవాడు. ఈ క్రమంలో'డివైన్ టాక్' అనే జ్యోతిష్య యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఓ జ్యోతిష్కుడిని సంప్రదించాడు. అతడు పూజల పేరుతో విడతల వారీగా రూ.12.21 లక్షలు వసూలు చేశాడు. అయినా తన సమస్యలు తీరకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసుకుల ఫిర్యాదు చేశాడు.