కేరళలో పోలీసుల నుంచి తప్పించుకోవాలని ఇయ్యదన్ షానిద్ అనే వ్యక్తి తన వద్దనున్న రెండు MDMA డ్రగ్స్ ప్యాకెట్లను మింగేశాడు. అంబయతోడ్‌లో ఈ సంఘటన జరిగింది. అయితే అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోజికోడ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. కడుపులోని డ్రగ్స్ ప్యాకెట్లు తొలగించడానికి వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు.