తెలంగాణలోని డ్వాక్రా సంఘాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. డ్వాక్రా సంఘాలకు ఏడాదికి రూ. 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మహిళా శక్తి సభలో వెల్లడించారు. గత కాంగ్రెస్ పాలనలో డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారని గుర్తుచేశారు. పదేళ్లు BRS ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను పట్టించుకోలేదని భట్టి మండిపడ్డారు.