ఓటీటీ, సీరియల్స్‌పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

63చూసినవారు
ఓటీటీ, సీరియల్స్‌పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
TG: BRS MLC కవిత ఓటీటీ, సీరియల్స్ కంటెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియల్స్‌లలో మహిళలను విలన్‌లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అన్నింటిపై స్పందించే మహిళలు వీటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఒకప్పుడు ఊరి చివర అశ్లీలమైన పోస్టర్ ఉంటేనే మహిళా సంఘాలు వాటిని చించి ధర్నాలు చేసేవారని, ఇప్పుడు ఓటీటీల రూపంలో అశ్లీలత ఇంట్లోకే వచ్చినా స్పందించకపోవడానికి కారణమేంటో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్