ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? అని ఓ వైద్య విద్యార్థిని ప్రశ్నించగా సీఎం చంద్రబాబు తన ఆరోగ్య సూత్రాలను వివరించారు. "నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకొనే వరకు పనిలోనే ఉంటా. మీ కన్నా చురుగ్గా, యువకుల కన్నా ముందు చూపుతో ఉంటా. నాకుప్రజలకు మంచి చేయాలనే స్వార్థం ఉంది. ఆ మంచి పేరు దక్కించుకోవాలని నిరంతరం ఆలోచిస్తా. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. మందులకు అలవాటు పడకూడదు’’ అని సీఎం వివరించారు.