ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియ మరింత సులభతరం!

80చూసినవారు
ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియ మరింత సులభతరం!
ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్లు మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త పోర్టల్ ను తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీలు, ఆసుపత్రులు, పాలసీదారులకు మధ్య ఇది ఉమ్మడి వేదికగా ఉండనుంది. దీంతో ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్