లీప్ న్యూస్ పేపర్ గురించి విన్నారా?

55చూసినవారు
లీప్ న్యూస్ పేపర్ గురించి విన్నారా?
నాలుగేళ్లకోసారి వచ్చే న్యూస్ పేపర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రాన్స్‌లో ఓ వార్తాపత్రిక లీప్ ఇయర్‌లో ప్రచురితమవుతుంది. 'లా బౌగీ డు సప్పర్(ది సప్పర్స్ క్యాండిల్)' పేరుతో వచ్చే ఈ పత్రిక 20పేజీలతో ఉంటుంది. ఈ పత్రికలో జాతీయ, అంతర్జాతీయ, క్రీడా, సినిమాలపై సెటైరికల్ కథనాలు, జోక్స్, క్రాస్‌వర్డ్స్ ఇస్తారు. అయితే వాటి సమాధానాలు మాత్రం తదుపరి ఎడిషన్‌లో చెబుతారు.ఈ పత్రిక ధర భారత కరెన్సీలో దాదాపు రూ.440 ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్