హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని తమ ఇంట్లో చోరీ జరిగిందని విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.2 లక్షలకు పైగా విలువైన డైమండ్ రింగులు అపహరణ గురైనట్లు ఆయన ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు సీసీటీనీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి బైక్ పై వచ్చి చోరీ చేసినట్లు గుర్తించారు. ఆ దొంగ కేవలం 20నిమిషాల్లోనే చోరీ చేసి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.