హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని నాచారం, ఉప్పల్, కూకట్ పల్లి, JNTU, మూసాపేట్, జగద్గిరి గుట్ట,నిజాం పేట్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, మల్కాజ్ గిరి, అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.