భారీ వర్షాలు .. నిలిచిన విద్యుత్‌ సరఫరా (వీడియో)

76చూసినవారు
ముంబయిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స రఫరా కూడా నిలిచిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. జూన్‌ 14 నుండి 19 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలు రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపుతున్నాయని పశ్చిమ రైల్వే పేర్కొంది. దక్షిణ ముంబయిలోని పలు ప్రాంతాల్లో ఐదు గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్