దేశంలో రైతులు మరోసారి పోరుబాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద 'ఛలో ఢిల్లీ' పేరుతో నిరసన చేపట్టారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నిరసనలను పోలీసులు అడ్డుకోవడంతో శంభు సరిహద్దు ప్రాంతంలో భారీ ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.