మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాసిక్ జిల్లా ముంబై-ఆగ్రా హైవేలోని వెదురు గిడ్డంగిలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి.. సుమారుగా 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.