TG: మంత్రి పొన్నం ప్రభాకర్ పై సినిమా డైరెక్టర్, కాంగ్రెస్ సానుభూతిపరుడు సయ్యద్ రఫీ కీలక ఆరోపణలు చేశారు. కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పొన్నం తన భూమికే ఎసరు పెట్టాడని అన్నారు. గుడి కోసం 30 కోట్ల భూమి ఇస్తే పక్కనున్న తమ ప్రైవేట్ భూమి మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా పెట్టాడని అన్నారు. అందుకు కొన్ని ఆధారాలు చూపిస్తూ సయ్యద్ రఫీ ప్రెస్ మీట్ పెట్టారు.