నేడు సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణం

78చూసినవారు
నేడు సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణం
ఇవాళ జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా జెఎంఎం అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను రాష్ట్ర గవర్నర్‌ సి.పి. రాధాకృష్ణన్‌ ఆహ్వానించినట్లు పార్టీ నేత ఒకరు గురువారం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి చంపాయి సోరెన్‌ బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. హేమంత్‌ సోరెన్‌ను శాసనసభా పక్ష నేతగా జెఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్