మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు. 'జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. చిరునవ్వుతో ఎదుర్కోవాలి' అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ పోస్ట్‌పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పందించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె దండం పెట్టే ఎమోజీని షేర్ చేసింది. కేటీఆర్ పోస్ట్‌కు సామ్ స్పందించడంతో నెటిజన్లు వరుస కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.