హైకోర్టు ఆదేశాలు.. కేటీఆర్‌ నల్గొండ పర్యటన రద్దు

76చూసినవారు
హైకోర్టు ఆదేశాలు.. కేటీఆర్‌ నల్గొండ పర్యటన రద్దు
రేపటి కేటీఆర్ నల్గొండ పర్యటన రద్దయ్యింది. నల్గొండలో బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసుల అనుమతి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకోవాలని సూచించింది. అనంతరం.. బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటీషన్‌ను 27కు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్