వాంపైర్ ఫేషియల్‌తో ముగ్గురికి HIV

23751చూసినవారు
వాంపైర్ ఫేషియల్‌తో ముగ్గురికి HIV
అమెరికాలోని న్యూ మెక్సికోలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అందంగా కనిపించేందుకు 2018లో ఓ స్పాలో ముగ్గురు మహిళలు వాంపైర్ ఫేషియల్ చేయించుకున్నారు. కొన్నాళ్లకు వారు HIV బారిన పడ్డారు. HIV సోకిన వారికి వాడిన సిరంజీలను వీరికి వాడినట్లు దర్యాప్తులో తేలింది. ఇక ఆ స్పాకు అనుమతి లేదు. దీంతో అధికారులు దానిని మూసివేయించారు. ఆ స్పాకు వెళ్లిన ఖాతాదారులకు రక్త పరీక్షలు చేయగా, వారంతా ఆరోగ్యంగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్