దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు

67చూసినవారు
దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు
తెలంగాణలో కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల మందగమనం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం కూరగాయల దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపించింది. రైతు బజార్లతో పోలిస్తే చిల్లర మార్కెట్‌లో ఏకంగా 60 శాతం వరకు ధరలు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. టమాటా కేజీ రూ.100, పచ్చిమిర్చి కేజీ రూ.80, బీన్స్ రూ.120, వంకాయ రూ.40, సోరకాయ రూ.40, కాకరకాయ రూ.50లు పలుకుతోంది. 20 రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్