థ్రిల్ కోసమని స్నేహితుల ప్రోత్సాహంతో యువత మొదట్లో సరదాగా సిగరెట్, మందు త్రాగడం వంటివి ప్రారంభిస్తారు. అయితే కాలక్రమంలో అవి వ్యసనాలుగా మారిపోతాయి. వాటితో సరిపెట్టకుండా మరింత కిక్కు అందించే డ్రగ్స్ వైపు వీరు ప్రయాణం చేస్తున్నారు. జీవితంలో ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసమని, నిస్సత్తువగా మారిన బతుకులో కొంత ఉత్తేజం పొందాలని, ప్రేమలో విఫలమై ఆ బాధకు ఉపశమనం పొందాలనే ప్రయత్నంలో డ్రగ్స్ ను ఆశ్రయిస్తున్నారు.