తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ ఫుల్ అయిపోయాయి. దీంతో శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 80,404 మంది భక్తులు దర్శించుకోగా, 35,825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.