విత్తనం నాణ్యత ఎలా తెలుసుకోవాలి

53చూసినవారు
విత్తనం నాణ్యత ఎలా తెలుసుకోవాలి
ఖరీఫ్ కాలం ప్రారంభమైంది. అక్కడక్కడ అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకున్నారు. అయితే రైతులు విత్తనాలు విత్తుకునే ముందు మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించుకోవాలి. విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరీశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి, వాటి జన్యు, భౌతిక స్వచ్చత వివరాలు తెలుసుకోని మాత్రమే కొనుగోలు చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్