వికారాబాద్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత

63చూసినవారు
వికారాబాద్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. మోమిన్ పేట్ సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. నవాబుపేట ఎస్సై భరత్ భూషణ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ.1 కోటి 5 లక్షల నగదు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్