భారీ డిమాండ్.. ఏసీల ధరలకు రెక్కలు

83చూసినవారు
భారీ డిమాండ్.. ఏసీల ధరలకు రెక్కలు
ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ఏసీలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దీంతో గతంలోనే ధరలను స్వల్పంగా పెంచిన కంపెనీలు.. తాజాగా మరోసారి 6 నుంచి 8 శాతం వరకు సవరించాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో వోల్టాస్, ఎల్‌జీ, లాయిడ్ సంస్థలు తమ కెపాసిటీని రెండింతలు చేశాయి. విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అలాగే దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏసీ స్టాకులను ఉత్తరాదికి తరలిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్