ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్థ వీవో త్వరలో V40 సిరీస్ ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో V30 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వివో వీ30 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ర్యామ్ రూ.33,999 నుంచి రూ.31,999కి, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999 నుంచి రూ.33,999కి, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.37,999 నుంచి రూ.35,999లకు తగ్గించింది.