జపాన్ పశ్చిమ తీరంలో భారీ
భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల తీవ్రత 7.2గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూ ఉపరితలానికి 50 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం నమోదుకాలేదని చెప్పారు.