ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 1:24 గంటలకు ఈశాన్య కష్మార్ నగరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. దాదాపు 120 మంది గాయపడినట్లు రాష్ట్ర మీడియా వెల్లడించింది. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.