భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

69చూసినవారు
భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఉత్తర కాశ్మీర్‌ బారాముల్లా జిల్లా ఉరీలోని గోహ్లాన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ క్రమంలో చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ మేరకు ఉరీ సెక్టార్‌లోని ఎల్‌ఓసి సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్