ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ధార్చులలో శనివారం తవాఘాట్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. హైవేపై అకస్మాత్తుగా పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకుని చెత్తను తొలగించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.