భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. శాలిగౌరారం మండలం వల్లాలకు చెందిన మాధగోని ప్రశాంత్ (30), సూర్యాపేటకు చెందిన శివలీల భార్యాభర్తలు. వీరికి రెండు సంవత్సరాల పాప ఉంది. భార్యాభర్తల మధ్య గొడవల రాగా శివలీల తన పుట్టింటికి వెళ్లింది. పెద్దల్లో పంచాయతీ పెట్టగా అందరి ముందు భార్య, అత్త, బామ్మర్ది బాగా తిట్టారని సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధగోని ప్రశాంత్ ఉరేసుకొని మృతి చెందాడు.