మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. టీవీలో క్రైం షోలు చూసి భార్యను హత్య చేసిన ఓ వ్యక్తి.. ఈ దారుణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గ్వాలియర్కు చెందిన ప్రదీప్ గుర్జర్ భార్యను చంపి మృతదేహాన్ని కంపూ పీఎస్ పరిధిలో రోడ్డుపై పడేశాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. ప్రదీప్ చిత్రహింసల వల్లే ఆమె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. మహిళ పోస్టుమార్టం రిపోర్టులో అదే తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.