హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రేపటి నుంచి IPL 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో మెట్రో రైలు టైమింగ్స్ ని పొడిగించింది. చివరి మెట్రో రైలు రాత్రి 12.15 గంటలకు బయలుదేరి 1.10 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ఐపీఎల్ సీజన్ ముగిసే వరకూ ఉంటుందని, నాగోల్, ఉప్పల్, స్టేడియంతో పాటు NGRI స్టేషన్‌లలో మాత్రమే ఎంట్రీ ఉంటుందని పేర్కొన్నారు.