13 ఏళ్ల కిందట ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు 263 పరుగులు సాధిస్తే ఔరా అనుకున్నాం. కానీ గత ఏడాది లీగ్‌లో దీన్ని మించిన స్కోర్లు ఏకంగా నాలుగు నమోదయ్యాయి. 12 ఏళ్ల పాటు అత్యధిక స్కోరు రికార్డుతో ఉన్న RCB మీదే SRH 287/3 స్కోరుతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతే కాక ముంబయిపై 277/3, ఢిల్లీపై 266/7 స్కోర్లు సాధించింది. మరోవైపు కోల్‌కతా 272/7తో లీగ్‌లో మూడో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కాబట్టి ఈసారి ఏదో ఒక జట్టు 300 మార్కును అందుకుంటే ఆశ్చర్యమేమీ లేదు.