హైదరాబాద్ ప్లేయర్ బ్యాట్ మిస్సింగ్!

76చూసినవారు
హైదరాబాద్ ప్లేయర్ బ్యాట్ మిస్సింగ్!
ముంబై ఫ్లైట్లో వెళ్తున్న సమయంలో SRH ఆటగాడు రాహుల్ త్రిపాఠీ బ్యాట్ మిస్ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్లో వెల్లడించారు. 'మా జట్టు SRHతో ఇండిగో విమానం(6E5099)లో హైదరాబాద్ నుంచి ముంబై ప్రయాణిస్తుండగా నా క్రికెట్ కిట్ నుంచి బ్యాట్ మిస్ అయింది. ఇది నాకు చాలా బాధ, నిరాశ, అసహనాన్ని కలిగించింది. ఇండిగో సంస్థ వెంటనే స్పందించి నా బ్యాట్ తిరిగి నాకు వచ్చేలా చూడాలని కోరుతున్నా' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్