ఆలయాల అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నామని అంబర్ పేట్ కార్పొరేటర్ వినయ్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం అంబర్ పేట్ డివిజన్ పరిధి ప్రేమ్ నగర్లోని శ్రీ ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ ఆలయంలో 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినయ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషితో ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు.