అంబర్ పేట్ లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

59చూసినవారు
అంబర్ పేట్ లోని అలీ కేఫ్ చౌరస్తా వద్ద గురువారం మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సికింద్రబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, సీనియర్ నాయకులు వి. హనుమంతరావు తదితర లీడర్లు పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలే చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్