అంబర్ పేట్: పరిపాలన భవనం ఎదుట ఓయూ విద్యార్థుల ఆందోళన

67చూసినవారు
ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని వివిధ కళాశాలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరి డిటెయిన్ అయిన విద్యార్థులు తమ బ్యాక్ లాగ్ సబ్జెక్టుల పరీక్ష ఫీజును పెంచడాన్ని నిరసిస్తూ విద్యార్థులు గురువారం ఓయూ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాత విధానంలోనే ఫీజులను వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరు పట్ల తమపై ఆర్థిక భారం పడుతుందని అవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్