మూసీ ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేక ఇంజనీర్ల బృందం సోమవారం డ్రోన్ సర్వే నిర్వహించింది. ఈ డ్రోన్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా బహదూర్ పురా ఏరియా పరిధి మూసి నది గర్భంలో 527 నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రివర్ బెడ్ పరిధిలో ఉన్న ఈ నిర్మాణాలకు రెడ్ మార్క్ వేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు బఫర్ జోన్ వివరాలను సైతం సేకరించినట్లు వెల్లడించారు.