ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ అన్నారు. బుధవారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్సిని కలిసి వారి పరిధిలో ఉన్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలకు సంబందించి వినతిపత్రం అందజేశారు. తప్పకుండా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ వారికి హామీ ఇచ్చారు.