బహదూర్ పురా జుపార్క్ విషయంపై శాసనసభలో ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ మంగళవారం ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా బహదూర్ పురా జూపార్క్ కు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారని తెలిపారు. అయితే స్థానికంగా పూట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే పర్యాటకులకు సులువుగా ఉంటుందని అన్నారు. ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించే పనుల్లో భాగంగా ఇది తప్పకుండా చేయవలసిన అవసరం ఉందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.