బహుదూర్ పురా: నూతన రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ

77చూసినవారు
బహుదూర్ పురా: శాస్త్రీపురం డివిజన్ పరిధిలో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని శాస్త్రీపురం కాలనీలో కొనసాగుతున్న నూతన రోడ్డు పనులను పరిశీలించారు. రూ. 25 లక్షలతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, గడువులోగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్