విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీలో వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ పండుగ

51చూసినవారు
హైదరాబాద్ నగరంలో హస్తినాపురం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీలో అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలంతా పూలతో బతుకమ్మలను తయారుచేశారు. బతుకమ్మ పండుగలో పాల్గొని ఎంగిలి పూల బతుకమ్మ రోజు గ్రాండ్ గా దాండియా ఆడుతూ అదేవిధంగా బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించి కాలనీ అసోసియేషన్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్