చాంద్రాయణగుట్ట: రోడ్డుపై డివైడర్ ను డీ కొట్టిన కారు

54చూసినవారు
మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు జాతీయ రహదారి అరంఘర్ నుంచి శంషాబాద్ వైపు వెల్లె దారిలో సర్వీస్ రోడ్డుపై డివైడర్ ను కారు డీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్