ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో శ్రీ శివాలయం ప్రాంగణములో గల యాగశాలలో 17 జనవరి 2025 శుక్రవారం ఉదయం 11. 00 గంటలకు సంకటహర చతుర్ధి సందర్భంగా గణపతి హోమం నిర్వహించారు. అర్చకులు నేతి సేతు మాధవ శర్మ, మధుసూదన శర్మ, శుక్లా మహరాజ్ యజ్ఞ క్రతువును జరిపించారు. హోమం ముగిసాక హోమంలో పాల్గొన్న భక్తులు యాగశాల చుట్టూ 5 ప్రదక్షిణలు చేశారు.