ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు భరోసా కల్పిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని చార్మినార్ కు చెందిన మహమ్మద్ హైదర్, సికింద్రాబాద్ కి చెందిన డి. మల్లేశం, నల్గొండకి చెందిన శ్రీనివాస్ లకు సీఎం సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులు చిన్నారెడ్డికి చెక్కులు అందచేసిన సందర్బంగా ధన్యవాదములు తెలియజేశారు.